అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

Purushothapatnam Villagers

  • పురుషోత్తం పట్నం భూ వివాదంపై గ్రామస్తుల వివరణ
  • ఇల్లు నిర్మిస్తున్న స్థలం గ్రామ కంఠానిదని వెల్లడి
  • ఈఓ రమాదేవి స్పృహ కోల్పోవడం నాటకమని ఆరోపణ

భద్రాచలం రామాలయ అధికార్లు చెబుతున్నట్లు పురుషోత్తం పట్నంలో ఇల్లు కడుతోంది రాములోరి భూమిలో కాదని, ఆ స్థలం గ్రామ కంఠానిదని గ్రామస్తులంటున్నారు. బుధవారం స్థానిక ఎంపీటీసీ వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వివాదాస్పదమైన ఇంటిని 40 సంవత్సరాల క్రితమే నిర్మించారన్నారని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం అగ్నిప్రమాదంలో ఆ ఇల్లు కాలి పోయిందని, ఇప్పుడు అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతుంటే రామాలయం అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పురుషోత్తం పట్నం గ్రామం ఏర్పడి 80 సంవత్సరాలవుతుందని, రామాలయం అధికారులు అభ్యంతరం చెబుతున్న ఇల్లు పురుషోత్తం పట్నం గ్రామ కంఠంలొ ఉందని పేర్కొన్నారు. ఆ ఇంటికి గ్రామ పంచాయతీ అనుమతి కూడా ఉందని తెలిపారు. మంగళవారం చోటు చేసుకున్న వివాదంలో, ముందుగా నిర్మాణంలో ఉన్న ఇంటి యజమాని పుల్లమ్మను భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవి వెంట వచ్చిన వాళ్ళు బలవంతంగా లాగి కింద పడేసారని చెప్పారు. పుల్లమ్మ మూర్చ పోవడంతో భయ పడిన ఈఓ స్పృహ కోల్పోయినట్లు నాటకమాడి, మమ్మల్ని దోషులుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈఓ చుట్టూ ఆమె వెంట తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారని తెలిపారు. అక్రమ నిర్మాణం చేపడుతుంటే చట్ట పరంగా సంభందిత అధికారులకు ఫిర్యాదు చేయాలి కానీ, ఇలా ప్రైవేటు వ్యక్తులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడటమేంటని ప్రశ్నించారు.


Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి